Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిగివచ్చిన చైనా - భారతీయ విద్యార్థులకు అనుమతి

Advertiesment
china
కరోనా సంక్షోభం తర్వాత చైనాలో విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. అయితే, అక్కడి విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు చైనా విదేశాంగ నుంచి పలు రకాలైన ఆంక్షలు ఎదురవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో విద్యార్థుల సమస్యను చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 
 
ఇదే అంశంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝూవో లిజియాన్ మాట్లాడుతూ, భారత విద్యార్థులు తిరికి వచ్చే విషయానికి చైనా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భారతీయ విద్యార్థులు చైనాకు తిరిగి వచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అయితే, చైనాకు రాదలచుకున్న విద్యార్థుల జాబితాను భారత్ మాకు ఇవ్వడమే మిగిలివుందన్నారు. 
 
భారత్‌కు చెందిన వారు పెద్ద సంఖ్యలో చైనాకు రావాలనుకుంటున్న విషయం మాకు అర్థమైందన్నారు. వారందరి పేర్లను సేకరించేందుకు భారత్ అధికారులకు కొంత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులను అనుమతించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బిగ్ బాస్' షోల వల్ల సమాజంలో వింత పోకడలు - ఏపీ హైకోర్టు