Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బిగ్ బాస్' షోల వల్ల సమాజంలో వింత పోకడలు - ఏపీ హైకోర్టు

big boss
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:35 IST)
బిగ్ బాస్ షో‌ అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహిస్తుందంటూ తమిళనాడుకు చెందిన తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత 2019లో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరిచింది. ఈ పిటిషన్‌పై అప్పటి నుంచి ఇప్పటివరకు విచారణకు నోచుకోలేదు. దీంతో ఆయన తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి మరోమారు ఈ పిటిషన్ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. 
 
దీనిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖర్ రావులతో కూడిన ధర్మానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంచి వ్యాజ్యమని ప్రశంసించింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. బిగ్ బాస్ వంటి కార్యక్రమాల వల్ల యువత పెడదారిపడుతోందని, ఇలాంటి వాటి వల్ల సమాజంలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ముఖ్యంగా మన పిల్లలు బాగున్నారని ఇలాంటి షోలలో తమకేం పని అని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించిది. ఇతరుల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్‌లో మనకు సమస్య ఎదురైనపుడు వారు కూడా పట్టించుకోరని కోర్టు గుర్తుచేసింది. 2019లో ఈ వ్యాజ్యం దాఖలు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం సోమవారం విచారణ చేపడుతామని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ సభకు అనుమతి నిరాకరించిన ఓయూ గవర్నింగ్ బాడీ