భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుని నానా తంటాలు పడుతున్నారు. భారతీయ పౌరులు, విద్యార్థులను తిరిగి స్వదేశానికి తెచ్చేందుకు ప్రత్యేక విమానాలను వాడుతోంది భారత ప్రభుత్వం. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికి వెనుదిరిగేందుకు భారత ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి తనను కలవరపెడుతున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వారిని సురక్షితంగా దేశానికి తరలించేందుకు చేపట్టనున్న చర్యల సమగ్ర వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన వారిని నిస్సహాయిలుగా వదిలేయడం సరికాదంటూ ఓ వీడియోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.