Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం కేసీఆర్... మూడు రోజుల పాటు హస్తినలో మకాం?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో ఆయన మూడు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నట్టు తెలుస్తుంది. 
 
తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని, ఇపుడు బంగారు భారత్ చేయాలన్న పట్టుదలతో జాతీయ రాజకీయాల్లోకి రానున్నట్టు సీఎం కేసీఆర్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలుసుకుంటూ వస్తున్నారు. 
 
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో సమావేశమయ్యారు. ఇపుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైగా, సీఎం కేసీఆర్ వెంట సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం. అలాగే, తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను సీఎం కేసీఆర్ నియమించుకున్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments