పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ చిత్రంలో ఓ ఆసక్తికరమైన పాయింట్ వుంది. పొలిటీషన్ కొడుకుగా రానా నటించాడు. అతన్ని సందర్భానుసారంగా భీమ్లా నాయక్ అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకు వస్తాడు. అక్కడ వున్న పోలీసులు యథాతథంగా రానా ఫోన్ లాక్కుని కాల్ లిస్ట్ చెక్ చేస్తుంటారు. అందులో ఒక్కో పేరు చూసి వారు ఆశ్చర్య పోతారు. అందులో కెటి.ఆర్. పర్సనల్, కెసి.ఆర్, కేంద్ర మంత్రుల నెంబర్లు వుంటాయి. దాంతో రానా పెద్ద వి.వి.ఐ.పి. అని షాక్ అవుతారు. ఇందులో ఎక్కడా ఆంధ్ర సి.ఎం. గురించి కానీ, అక్కడి మంత్రుల గురించి ప్రస్తావన లేకపోవడం విశేషం.
ఇది కేవలం పవన్ కళ్యాణ్ యాదృశ్చికంగా పెట్టాడంటే నమ్మలేం. ఆయనకు జరిగిన అనుభవాల నుంచి ఈ పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆంధ్రలోని పవన్ అభిమానులు కూడా ఖుషీ వున్నారని తెలుస్తోంది. ఆంధ్రలోని మంత్రులు అంతా పవన్‌ను ఇబ్బంది పెట్టినప్పుడు తెలంగాణ మంత్రుల పేర్లు ఫోన్ లిస్ట్‌లో వుండడం చాలా కరెక్ట్ అనే కోణంలో వారు వాదిస్తున్నారు. సినిమా చూశాక తమ పేర్లు కనీసం లేవని ఆంధ్ర మంత్రలు కొందరు బాధపడినా ఆశ్చర్యంలేదని అభిమానులు తెలియజేస్తున్నారు.పైగా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ లాంటివారు అండగా వుంటే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని స్టేట్ మెంట్ కె.టి.ఆర్. ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆంధ్రలోని ఏ ఒక్కరూ అలా అనలేదని ఇప్పటికైనా వారు గ్రహించాలని పవన్ అభిమానులు తెలియజేస్తున్నారు.