బుధవారం రాత్రి భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుక యూసుఫ్ గూడా పోలీస్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కె.టి.ఆర్. మాట్లాడుతూ, నన్ను ఇక్కడకు రమ్మని ఆహ్వానించిన పవన్‌కు ధన్యవాదాలు. 4 ఏళ్ళ నాడు చిరంజీవి, చరణ్ పిలిస్తే ఒక సినిమా వేడుకకు ఇక్కడకు వచ్చాను. యథలాపంగా.. తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ అని అన్నాను.
సోదరుడిగా పవన్ పిలిస్తే వచ్చాను. మంచి మనిషి. మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. సూపర్ స్టార్లు చాలామంది వుంటారు. కల్ట్ ఫాలోయింగ్ వున్న విలక్షణమైన నటుడు. మేమంతా కాలేజీ రోజుల్లో తొలి ప్రేమ చూసినవారమే. 25 ఏళ్ళపాటు ఒకేరకమైన స్టార్‌డమ్ సంపాదించుకోవడం అసాధారణమైన విషయం.
దర్శకుడు సాగర్ చంద్ర నల్లగొండ నుంచి వచ్చి పవన్‌తో సినిమా చేశాడు. 8 ఏళ్ళుగా భారత చలన చిత్ర పరిశ్రమకు సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్ వుండాలని. కె.సి.ఆర్. హయాంలో పురోగమిస్తున్నాం. కళ్యాణ్ లాంటివారు అండగా వుంటే చలన చిత్ర పరిశ్రమ దినదినాభి వృద్ధి చెందుతోంది. ఈరోజే కాలేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
నేను కళ్యాణ్‌ను కోరుతున్నా... కాలేశ్వరం గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. ఇక్కడ కూడా షూటింగ్ చేసుకోవచ్చు. భీమ్లానాయక్ ద్వారా అజ్ఞాత సూర్యుల్ని మొగిలయ్య, దుర్గాభాయ్, శ్యామ్ లాంటి వంటివారిని తీసుకువచ్చారని తెలిపారు.