ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ కె.చంద్ర, కాంబినేషన్‌లో రాబోతున్న భీమ్లా నాయక్ గురించి ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పాత ఫార్మెట్‌తోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఇప్పటి ట్రెండ్‌ను బట్టి ఆన్‌లైన్ బుకింగ్, బుక్ మై షోలు వుండవన్నమాట. ఇలా కాకుండా నేరుగా ఎగ్జిబిటర్ కు, పంపిణీదారుడికి ప్రేక్షకుడి టికెట్ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు.
సినిమా విడుదలరోజే ఎవరైనా థియేటర్‌కు వచ్చి సినిమా టిక్కెట్ కొనాల్సిందే. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఇలా చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఇటీవలే విడుదలైన అఖండ, పుష్ప సినిమాల తర్వాత ఏసినిమాకు ప్రేక్షకుడు థియేటర్ దగ్గరకు రావడంలేదు. ఆన్‌లైన్లో బుక్‌మై షోలు కొన్ని సినిమాలు బుకింగ్ వుండడంలేదు. తాజాగా సన్ ఆఫ్ ఇండియాకు అదే పరిస్థితి ఎదురైంది. తెలంగాణాలో అస్సలు ఒక్కరూ కూడా ఆ సినిమాకు బుక్‌చేసుకోకపోవడం విచిత్రం. అందుకే దాన్ని సాకుగా చూపుతూ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని కొందరు సూచించిన మేరకు భీమ్లా నాయక్ ను ఆ ఫార్మెట్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. సో. నేరుగా థియేటర్ దగ్గరే టికెట్ కొనడం అనేది మళ్ళీ పాత రోజులన్ని గుర్తు చేస్తున్నాయని ఛాంబర్ వర్గీయులు తెలియజేస్తున్నారు.