Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బండ్ల గణేష్ ఫోన్ కాల్ ఆడియో లీక్.. ఆ గొంతు నాది కాదు?! (video)

Advertiesment
Bandla Ganesh
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (13:29 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. 
 
థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు. భీమ్లా నాయక్' మూవీని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.   
 
భీమ్లా నాయక్ మూవీ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు.. బండ్ల గణేష్ పేరిట ఒక వ్యక్తి.. అభిమానితో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ తాజాగా లీకైంది. 
 
ఇందులో సదరు ఫ్యాన్‌ ఆయనను భీమ్లా నాయక్ ఈవెంట్‌కు వెళ్తున్నావా? అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలోనే బండ్ల గణేష్ ముందు వెళ్తున్నానని.. ఆ తర్వాత తనపై కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
 
ఇదే ఫోన్ సంభాషణలో బండ్ల గణేష్‌గా చెబుతున్న వ్యక్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. 'ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను పిలవలేదమ్మా. ఆ త్రివిక్రమ్ర్ రావొద్దట్టన్నట్లు ఆ సంభాషణ సాగింది.  

 
 
తాజాగా వచ్చిన ఆడియో ఫైల్ నిజమా కాదా అనే విషయంపై చర్చ జరుతుంది. ప్రస్తుతం ఈ ఆడియో ఫైల్ యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. కానీ ఈ ఫోన్‌కాల్ ఆడియో లీక్‌ను బండ్ల గణేష్ కొట్టిపారేశాడు. ఆడియోలో వున్నది తన గొంతు కాదని స్పష్టం చేశాడు బండ్ల గణేష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధే శ్యామ్ సినిమాకు అమితాబ్ వాయిస్ ఓ\వ‌ర్‌