పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ఇది పెద్దగా ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ చాలామంది తెలియజేస్తున్నారు. బ్రహ్మాండంగా వుంటుందనుకున్న ట్రైలర్ పేలవంగా వుందని సోషల్ మీడియాలో అభిమానులే మనసులోని మాట చెబుతుంటే, మరికొందరు అదిరిపోయిందంటూ స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో దీనిపై డివైడ్ టాక్ వుంది. అసలు కథలోని పాయింట్ ఏమిటో అర్థంకాకుండా రానా, పవన్ కళ్యాణ్ ఇద్దరు కొట్టుకోవడంపై ట్రైలర్ కట్ చేశారు. దాంతో తాము ఊహించిన దానికంటే పెద్దగా లేదని టాక్ వినిపిస్తోంది.
పవన్ పాత్ర పరంగా ఎంత కేర్‌లెస్‌గా వుంటాడో అదే ఇదిగా నిత్యమీనన్ పాత్ర వుంటుంది. సెల్లో అరెస్టయిన రానాను కాల్చేందుకు పవన్ తుపాకీ తీస్తాడు. కానీ అక్కడ తను వుండడు. ఎవరిపైనో కాల్పులు జరుగుతాయి. ఈ విషయాన్ని పోలీసు అధికారి మురళీ శర్మ ముందే నిత్యమీనన్ వచ్చి, ఏం నాయక్ నువ్వు పేల్చినప్పుడు వాడు లేడా? చూసుకోవాలి కదా! అంటూ డైలాగ్ చెబుతుంది... వెంటనే గొప్పదానివి దొరికావ్? అంటూ మరో పోలీసు అధికారి మురళీ శర్మ అంటాడు.
అదేవిధంగా `నేను ఇవతలుంటే చట్టం.. అవతల వుంటే కష్టం.. వాడికి.. అంటూ డైలాగ్ పవన్ చెబుతాడు. దీన్ని రకరకాలుగా డిజైన్ చేసేస్తున్నారు నెటిజర్లు. ప్రభుత్వం గురించి సెటైర్ వేశాడా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత చర్చ జరుగుతున్న ఈ సినిమా ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో టాప్‌లో వుండడం విశేషం. ఇందుకు పవర్ స్టార్ పవర్ కారణంగా సినీ పెద్దలు తెలియజేస్తున్నారు.
టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ నుంచి ఇప్పుడు 1 మిలియన్ లైక్స్ వరకు రోరింగ్ రెస్పాన్స్‌తో అదరగొట్టింది. తెలుగులో ఏ సినిమాకి లేని విధంగా కేవలం 13 గంటల 30 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ అందుకొని ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్‌తో వెళుతుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నిర్మించింది.