Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేజ ద‌ర్శ‌క‌త్వంలో అహింస నుంచి అభిరామ్ దగ్గుబాటి ప్రీ-లుక్

Advertiesment
Teja
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:44 IST)
Ahimasa pre look
తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల‌ను అందించి, ఎందరో ప్రతిభావంతులైన నటీనటులను పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకులు తేజ, మూవీ మొగల్ డి. రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, హ్యాండ్స‌మ్‌ హంక్ రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
దర్శకుడు తేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ రోజు ఈ సినిమా టైటిల్ మరియు ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి `అహింస` అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ టైటిల్ డిజైన్ చేయడానికి జూట్ బ్యాగ్ ఆకృతిని ఉపయోగించారు. ఈ పోస్ట‌ర్లో  ర‌క్తం కారుతున్న అభిరామ్ ముఖం జూట్ బ్యాగ్‌తో కప్పబడి ఉంది. ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయేలా ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది.
 
ఆర్.పి.పట్నాయక్ ను సంగీత ద‌ర్శ‌కుడిగా తేజ ప‌రిచ‌యం చేశారు. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ వ‌చ్చాయి. చాలా సంవత్సరాల తరువాత వాళ్లిద్ద‌రు మ‌ళ్లీ క‌లిసి ఈ చిత్రానికి ప‌నిచేయ‌బోతున్నారు.
 
ఈ మూవీలో ప్రముఖ నటీ నటులు, సాంకేతిక నిపుణులు భాగం అయ్యారు. చంద్రబోస్ ఈ సినిమాలోని పాటలన్నింటిని రాయగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.
 
 
అహింస మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
 
తారాగ‌ణం: అభిరామ్ ద‌గ్గుబాటి
 
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌.ద‌ర్శక‌త్వం:  తేజ‌, నిర్మాత‌:  పి, కిర‌ణ్‌,  బ్యాన‌ర్‌: ఆనంది ఆర్ట్  క్రియేష‌న్స్‌, సంగీతం: ఆర్‌.పి ప‌ట్నాయ‌క్‌,  డిఓపి: స‌మీర్ రెడ్డి, ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, లిరిక్స్‌: చంద్ర‌భోస్‌, స్టంట్స్‌: రియ‌ల్ స‌తీష్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తి సురేష్ మ్యూజిక‌ల్ వీడియో గాంధారి విడుద‌ల‌