Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (07:46 IST)
శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది.

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. పారిపోతున్న నలుగురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు.

సంఘటనా స్థలానికి సీపీ సజ్జనార్‌
దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు.

దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments