Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలపై మృగాళ్ల అరాచకత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ

Advertiesment
మహిళలపై మృగాళ్ల అరాచకత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ
, సోమవారం, 2 డిశెంబరు 2019 (17:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన దళిత సంచార మహిళ టేకు లక్ష్మీ, డాక్టర్ ప్రియాంక రెడ్డి, మానస ముగ్గురు యువతులపై మానవ మృగాళ్లు పైశాచిక దాడిని ఖండిస్తూ గన్నవరం జడ్పీ హైస్కూలు మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన జరిగింది. మహిళలు రక్షణపై దేశవ్యాప్తంగా భయాందోళన కలిగిస్తోందని పలువురు అవేదన వ్యక్తం చేశారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ పై కఠిన చట్టాలు అమలుచేయాలని కోరారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి ఆలసత్వం పాటించకుండా అండగా నిలిచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100, 112, 118 కాల్ చేసి సాయం కోరితే 5 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుని పోలీసులు రక్షణ కల్పిస్తారని అధ్యక్షుడు దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు.
 
పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మార్షల్ ఆర్ట్స్., కరాటే లాంటి శిక్షణ నివ్వాలని కోరారు. జోనల్ ప్రెసిడెంట్ కె.ఎన్ బాబురావు, పూర్వ అధ్యక్షులు పొలిమేట్ల జయరాజు, జాన్సన్, విజయకుమార్, చిమటా రామారావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు గొట్టం రవిబాబు, ఏ.ఎస్ఐ వేంకటేశ్వరావు, హైస్కూలు పీడీ చంద్రశేఖర్, బొకినాల కోటేశ్వరరావు, సాంబశివరెడ్డి, యోగా గురువు బాలకృష్ణ పలువురు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#JusticeForDisha ఈ ఘటన తలదించుకునేలా చేసింది : రాజ్‌నాథ్