గిరిజన భాషల్లోనూ పాఠ్య పుస్తకాలు.. తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయోగం

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (08:34 IST)
గిరిజన చిన్నారులు తెలుగుతో పాటు తమ తెగలకు సంబంధించిన భాషల్లోనూ చదువుకునేలా తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయోగంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ప్రాథమిక విద్యను పటిష్ఠం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,426 గిరిజన పాఠశాలలను నెలకొల్పి గిరిజన విద్యార్థులు తమ మాతృభాషలోనే చదువుకునేందుకు 2020-21 విద్యా సంవత్సరానికిగాను వాచకాలను రూపొందించింది.

గిరిజనులకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
 
ఇందుకుగాను ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కొలామి వాచకం, గోండి వాచకం, బంజార వాచకం, కోయ వాచకాలను ఈ విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ వాచకం ద్వారా ఒకటో తరగతిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాలను ఒకటవ పాఠంలో పునశ్చరణ చేసి, తక్కిన పాఠాల్లో విద్యార్థి పఠన, లేఖన, శ్రవణ నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన గిరిజన ఇతివృత్తాలు ఎంచుకొని ఆసక్తికరంగా తయారుచేశారు.
 
2019-20లో ప్రయోగాత్మకంగా బంజారా, గొండి, కోయ, కొలామి భాషల్లో చిన్న పదాలతో పుస్తకాలను రూపొందించి ఆయా పాఠ్య పుస్తకాలతోపాటు తమ భాషకు సంబంధించిన పదాలను నేర్చుకునేలా దృష్టి పెట్టారు.

2020-21 విద్యాసంవత్సరం కోసం పూర్తిస్థాయిలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు గిరిజన భాషల్లో వాచకాలను తయారుచేసి అందుబాటులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం