Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మృతదేహం వాహనంలో ఆరుగురు మాత్రమే: కరోనా మృతులపై తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలు

Advertiesment
Telangana Government
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రం ప్రభుత్వం కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో మార్గదర్శకాలు విడుదల చేసింది.

మృతదేహం ఉన్న వాహనంలో ఆరుగురు మాత్రమే ప్రయాణించాలి. డ్రైవర్‌, ఒక సహాయకుడు, మృతుని బంధువులు నలుగురు వెళ్లొచ్చు. వారు ఎన్‌95 సర్జికల్‌ గ్లౌస్‌ ధరించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కొవిడ్‌ బాధితుల మృతదేహాలను భద్రపర్చి, మార్గదర్శకాల ప్రకారం సిద్ధంచేసి వారి స్వగ్రామాలకు తరలించేందుకు మార్చురీ ఏర్పాటు చేయబోతున్నారు.

కొందరు అధికారులతో కమిటీని వేసింది. కేంద్రం మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలు ఎలా చేయాలన్న దానిపై ఈ కమిటీ అధ్యయం చేసి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మెమోను జారీ చేసింది. ఈ మృతదేహం ఉన్న వాహనంలో ఆరుగురు మాత్రమే ప్రయాణించాలి.

డ్రైవర్‌, ఒక సహాయకుడు, మృతుని బంధువులు నలుగురు వెళ్లొచ్చు. వారు ఎన్‌95 సర్జికల్‌ గ్లౌస్‌ ధరించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంత్యక్రియల సమయంలో వాడే పరికరాలను ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి. ఖననం చేస్తే ఎనిమిది అడుగుల లోతున పూడ్చాలి. ఈ సమయంలో కూడా మొత్తం భాగంలో హైపో సోడియం క్లోర్లైడ్‌ పిచికారీ చేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాపించని జిల్లాలు ఏవి?