తెలంగాణాలో మారిపోయిన వాతావరణం.. 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (08:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటివరకు చల్లటి వాతావరణం కనిపించింది. కానీ, ఇపుడు ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఫలితంగా మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేరకు నమోదుకానున్నాయి. 
 
మొన్నటివరకు తెలంగాణ వ్యాప్తంగా చల్లటి వాతావరణం కనిపించింది. కానీ, సోమవారం మాత్రం ఎండను, ఉక్కపోతను తట్టుకోలేని వింతైన పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమవారం నుంచి వాతావరణం మారిపోయింది. ఎండ తీవ్ర పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇపుడు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. 
 
బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వైజాగ్ కాదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం

అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?

కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments