Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-05-2023 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన...

Advertiesment
Pisces
, శనివారం, 6 మే 2023 (04:00 IST)
మేషం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ వాహనం ఇతరులకివ్వటం వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. సంతానం చదువులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
వృషభం :- పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆలయాలను సందరిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరకపటుత్వం నెలకొంటాయి. దైవదర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలసివచ్చేకాలం. ఇతరుల విషయాలకుదూరంగా ఉండాలి. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ సోదరుల నుంచి చికాకులు తప్పవు. ప్రేమికులు పెద్దలతో ఏకీభవించలేకపోతారు. 
 
కర్కాటకం :- రాజకీయాల్లో వారికి సదావకావకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనలు పాల్గొంటారు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురౌతారు. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మాటకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. మీరు చేసిన వ్యాఖ్యలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కన్య :- పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు.
 
తుల :- కీలకమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పెరుగుతుంది.
 
వృశ్చికం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. చేతివృత్తుల వారికి, చిరువ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఉద్యోగస్తులు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు.
 
ధనస్సు:- దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. ఇతరుల ముందు కుటుంబ విషయాలు ఏకరువు పెట్టటం మంచిది కాదు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మకరం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికిసంతృప్తి లభిస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. బంధువులరాకతో కొంత అ సౌకర్యానికి గురవుతారు. మీరు చాలా కాలంగా చేయాలనుకున్న పనులను తక్షలమే పూర్తి చేస్తారు.
 
కుంభం :- టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి సత్కాలం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకులు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. సన్నిహితులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
 
మీనం :- ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-05-2023 శుక్రవారం రాశిఫలాలు - అమ్మవారిని ఎర్రని మందారాలతో పూజించి...