మేషం :- బంధు మిత్రులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తం నగదు డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది.
వృషభం :- ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మిథునం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఓర్పు, నేర్పు మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలకు నకళ్లు పొందుతారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం మంచిది కాదు.
కర్కాటకం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ప్రముఖులు, స్త్రీలతో మితంగా సంభాషించండి.
సింహం :- చల్లని పానీయ, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు ఒక వార్తఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది.
కన్య :- పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్యచికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పని భారం బాగా పెరుగుతుంది. వాహనం ఇతరులకుఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తుల :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది. కోళ్ళ, మత్స్యరంగాల్లో వారికి చికాకులు తప్పవు. ఆటోమోబైల్, రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు. పెద్దల ఆరోగ్యములో మెళుకవ అవసరం.
వృశ్చికం :- ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఏ విషయంలోనూ ఒంటెత్తుపోకడ మంచిదికాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
ధనస్సు :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. క్రీడల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారులతో ఏకీభవించలేకపోతారు. చేతివృత్తులు, కాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసివస్తుంది. నిరుద్యోగులు తాత్కాలిక ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటారు.
మకరం :- పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
కుంభం :- కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయాల్లో వారికి సదావకావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
మీనం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక పనులు సానుకూలమవుతాయి. సొంత వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. క్యాటరింగ్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది.