తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీనికారణంగా ఆ రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన బీజాపూర్ రహదారిలో జరిగింది.
చేవెళ్ల నుంచి హైదరాబాద్‌కు ఓ అంబులెన్స్ రోగిని ఎక్కించుకుని అత్యవసరంగా బయలుదేరింది. ఇది బీజాపూర్ రహదారిపై ఆదివారం సాయంత్రం వెళుతుండగా, అంబులెన్స్‌కు చోటిచ్చే క్రమంలో కారులో ముందుకెళుతున్న వ్యక్తి తన కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో దాని వెనుకనే వస్తున్న ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
అంతే ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోవడంతో స్పందించిన వాహనదారులే చొరవ తీసుకుని కార్లను రోడ్డు పక్కను తరలించారు. డ్రైవింగ్ సమయంలో ఒకదానికొకటి కనీస దూరం పాటించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.