Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత?

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (12:08 IST)
తెలంగాణలో ఈ నెల 20 నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వ్యవసాయ సీజన్‌ వేగం పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేతను అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఈ నెల 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఈ నెల 20 లోపు నిర్ణయం తీసుకోవాలి. 
 
మంత్రిమండలి సమావేశం నిర్వహించి, అందులో చర్చించి ఉత్తర్వులు జారీ చేయాలి. మరోవైపు పల్లె, పట్టణ ప్రగతి పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఈ నెల 20న మొదలు కానున్నాయి. సీఎం జిల్లా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను ప్రారంభించడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు.
 
ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం జరిగేది అనుమానంగా మారింది. ఆ పరిస్థితి ఉంటే సీఎం కేసీఆర్‌ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆదేశాలు ఇచ్చే వీలుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కరోనా కేసుల తగ్గుదలపై రోజువారిగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తోంది.
 
లాక్‌డౌన్‌ ఇకపై అవసరం లేదనే భావనతో ఆ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేతకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments