రైలు కింద పడి 300 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో గొర్రెల మంద పైనుంచి రైలు దూసుకెళ్లడంతో సుమారు 300 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నవీన్‌పేట మండలం కోస్గీ వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	కాపరి గొర్రెలను మేపుతుండగా మందంతా ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చింది. అదే సమయంలో రైలు వాయువేగంతో దూసుకువచ్చి ఢీకొట్టడంతో గొర్రెలు చెల్లాచెదురయ్యాయి. 
	 
	సుమారు రూ. 18 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. ఊహించని ప్రమాదంలో గొర్రెలన్నీ మృత్యువాతపడటంతో రైతు కుటుంబం ఘటనాస్థలంలో కన్నీరుమున్నీరైంది. బాధిత రైతును ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.