Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాల్వంచ విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Advertiesment
Massive Fire Break
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సీతారంపట్నం దగ్గరున్న 600 కెవి సబ్ స్టేషనులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను చూసిన వెంటనే అప్రమాతమైన సిబ్బంది అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 
 
ఆ తర్వాత క్షణాల్లో అక్కడకు తరలివచ్చిన అగ్నిమాపక సిబ్బంది... గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లే విద్యుత్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ.. కోర్ట్ చౌరస్తాకు ఆయన పేరు!