Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కొత్త సి ఎస్ గా సోమేష్ కుమార్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (17:47 IST)
తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె సి ఆర్ నిర్ణయించారు. సోమేష్ నియమాకాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వ జివో విడుదల చేసింది.

1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ మూడున్నరేళ్ల పాటు  కొనసాగనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెండేళ్లపాటు సేవలు అందించిన ఎస్‌కే జోషి ఈరోజు పదవీ విరమణ చేశారు.. దీంతో నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా ఎస్కే జోషిని నియమించారు సీఎం కేసీఆర్. కాగా, కొత్త సి ఎస్ కోసం  సి ఎం కెసిఆర్ పెద్ద కసరత్తే చేశారు..ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న కొందరి పేర్లపై దృష్టి పెట్టారు.

ఇలాంటి వారిలో కొందరు రాష్ట్ర సర్వీస్‌లో ఉంటే.. మరికొందరు కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారుల్లో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. చివరికి అదే జరిగింది.  సీఎస్ పదవి రేసులో సీనియర్‌ ఐఏఎస్‌లు అజయ్‌ మిశ్రా, సోమేష్ కుమార్‌, రాజేశ్వర్‌ తివారీ, శాంతికుమారి, చిత్రా రామచంద్రన్‌ల పేర్లు వినిపించాయి.

అలాగే అధర్‌ సిన్హా, రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, వసుధా మిశ్రా, షాలినీ మిశ్రా, బీపీ ఆచార్యల పేర్లూ వినపడ్డాయి. అయితే సీఎం కేసీఆర్ కి సన్నిహితంగా మెలిగే అధికారికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉందని భావించారు. దీంతో సీఎస్‌ రేసులో అజయ్‌ మిశ్రా, సోమేశ్‌ కుమార్‌ మధ్య ప్రధాన పోటీ ఉందని అధికార వర్గాల్లో వినిపించింది. చివరికి సోమేష్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments