Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హరితహారం చెట్లు నరికినందుకు రూ.45వేలు ఫైన్

హరితహారం చెట్లు నరికినందుకు రూ.45వేలు ఫైన్
, శనివారం, 21 డిశెంబరు 2019 (13:24 IST)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. కేవలం మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పగించింది. కొన్ని చోట్ల ఆ మొక్కలు పెరిగి చెట్లయ్యాయి. అయితే, కొందరు వ్యక్తులు ఆ చెట్లను నరుకుతున్నారు.
 
సిద్దిపేట పట్టణంలోని శివమ్స్ గార్డెన్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ నిర్వాహకులు హరితహారం చెట్లను నరికారు. తమ హోర్డింగ్ కనిపించడం కోసం ఫుట్ పాత్‌పై ఉన్న చెట్ల కొమ్మలను కొట్టేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెట్లను నరికేసిన వ్యక్తులను గుర్తించిన అధికారులు జరిమానా విధించారు. 
 
మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారికి ఆర్టికల్చర్ అధికారి ఐలయ్య రూ.45,000 జరిమానా విధించారు పట్టణంలోని మొక్కలకు ఎవరు హాని కలిగించిన వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పౌరసత్వ నిరసనలు : యూపీలో 11 మంది మృతి.. భీమ్ ఆర్మీ చీఫ్ అరెస్టు