Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియాలోనే అతిపెద్దదైన డోర్నకల్ చర్చిలో సత్యవతి రాథోడ్ ప్రార్థనలు

ఆసియాలోనే అతిపెద్దదైన డోర్నకల్ చర్చిలో సత్యవతి రాథోడ్ ప్రార్థనలు
, బుధవారం, 25 డిశెంబరు 2019 (16:44 IST)
ప్రజల కష్ట, సుఖాల్లో చర్చిల పాత్ర కీలకం
రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు
డోర్నకల్ ప్రజల అభివృద్ధిలో ఈ చర్చి సేవలు అభినందనీయం
 
అందరూ బాగుండాలని కోరుకునే సిఎం కేసిఆర్ గారికి ఏసు ప్రభు మరింత శక్తినివ్వాలి
సిఎం ముఖ్యమంత్రి చొరవతో ఎస్.ఆర్.ఎస్పీ నీరు వస్తుంది.. రైతులు సంతోషంగా ఉన్నారు
డోర్నకల్ గత పాలనలో కావల్సిన అభివృద్ధి కాలేదు.. ఇప్పుడు జరుగుతుందని నమ్ముతున్నాను
ఈ చర్చితో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది
 
డోర్నకల్ మార్కెట్ సమస్యలు తీర్చి అభివృద్ధి చేస్తాము 
ఆసియాలోనే అతిపెద్దదైన ఈ డోర్నకల్ చర్చిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రార్థనలు
 
ఆసియాలోనే అతిపెద్దదైన, విశిష్టమైన డోర్నకల్ చర్చిలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉదయం 6 గంటలకే ప్రార్థనలు జరిపి, క్రైస్తవ సోదర, సోదరిమణులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పండగ శుభాకాంక్షలు తెలిపారు. డోర్నకల్ ప్రాంత కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ చర్చి ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ చర్చితో, ఇక్కడి ప్రజలతో గత 30 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తాను గుర్తు చేసుకున్నారు.  
 
క్రిస్మస్ పండగ సందర్భంగా డోర్నకల్ చర్చి ద్వారా ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి జరిగేలా ఆశీర్వదించాలని ఆ కరుణామయుడైన ఏసు ప్రభును కోరుకున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునే సిఎం కేసిఆర్ గారికి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. 
 
డోర్నకల్ ప్రాంతం గత కొన్నేళ్లుగా కావాల్సిన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ అభివృద్ధి జరుగుతుందని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. ఎస్.ఆర్.ఎస్.పీ ద్వారా నేడు డోర్నకల్ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండేలా ఏసు ప్రభు ఆశీర్వదించాలని కోరుకున్నానని చెప్పారు.
 
అనంతరం డోర్నకల్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి అక్కడి వ్యాపారుల సమస్యలు తెలుసుకున్నారు. మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరుకు అమరావతికి అంతే దూరం.. కానీ విశాఖకు.. ఎంతో దూరం..!?