Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసుల గురించి బాగా వివరిస్తాను, రా అని చెప్పి ట్రైనీ ఎస్ఐపై ఎస్ఐ రేప్

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (17:52 IST)
ఆమె ట్రైనీ ఎస్.ఐ. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో ఎస్ఐగా పదోన్నతి రాబోతోంది. ప్రస్తుతం ఉన్న స్టేషన్లో ఎస్ఐతో కలిసి పనిచేస్తోంది. కేసులు ఎలా రాయాలో.. వచ్చిన కేసులను ఎలా టేకప్ చేయాలో తెలుసుకుంటోంది. అయితే కేసుల గురించి చెప్పాల్సిన ఆ ఎస్ఐ కామాంధుడి అవతారమెత్తాడు.
 
కేసుల గురించి ఇంకా బాగా చెబుతానంటూ పిలిపించుకుని ట్రైనీ ఎస్ఐని రేప్ చేశాడు. న్యాయం కోసం వెళితే దళిత మహిళ కావడంతో న్యాయం చేయడం లేదంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. 
 
వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ట్రైనీ మహిళా ఎస్ఐని కేసు గురించి వివరిస్తానంటూ ఎస్సై శ్రీనివాస్ పిలిపించుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ట్రైనీ ఎస్ఐ కావడంతో ఏమాత్రం భయపడకుండా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు తెలిపింది. కానీ ఉన్నతాధికారులు ఆ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. 
 
దీంతో ఆ మహిళా ఎస్ఐ వరంగల్ సిపి కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. తాను ఒక పోలీస్‌గా ఉంటే తనకే న్యాయం జరగక్కపోతే సామాన్యులకు ఇంకేం న్యాయం జరుగుతుందంటూ ఆందోళనకు దిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments