బిచ్చగాడు సినిమా తమిళంలో తీశారు. దాన్ని తెలుగులో విడుదలచేస్తే అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన చదలవాడ శ్రీనివాస్‌కు అంతకుముందున్న అప్పులు అన్నీ తీర్చేలా చేసింది. అలాంటి సినిమాకు మొదట హీరోగా అనుకుంది విజయ్ ఆంటోనిని కాదు. ఆ కథను మొదట చెప్పింది సిద్దార్థ్‌కే. దర్శకుడు శశి ఈ కథను ముందుగా సిద్దార్థ్‌కు చెప్పడంతోనే వెంటనే ఓకే చేశాడు. అయితే అక్కడే చిన్న ట్విస్ట్ జరిగింది. ఆ కథ విన్న తర్వాత సిద్దార్థ్ బిజీ అయిపోయాడు. బాలీవుడ్‌లోనూ ఆయన సినిమా చేస్తున్నాడు. ఒకవైపు తమిళంలోనూ వేరే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు డేట్స్ ఏడాదిపాటు ఖాళీ లేవు. దాంతో ఏమి చేయాలో అని ఆలోచిస్తున్న దర్శకుడు శశి కి తెలిసిన ఓవ్యక్తి విజయ్ ఆంటోనికి కథ వినిపించేలా ప్లాన్ చేశాడు.
విజయ్ ఆంటోని కథ విన్నవెంటనే బాగా నచ్చేసి మనం సినిమా చేస్తున్నాం అని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే మదర్, కొడుకు సెంటిమెంట్‌కు బాగా టచ్ అయింది. అమ్మ ఆరోగ్యం కోసం బిచ్చగాడుగా అడుక్కోవడం అనేది అన్నిచోట్ల వుంది. అయితే తమిళంలో అది కాస్త ఎక్కువ. ఇక వెంటనే ప్రారంభించాలని విజయ్ ఆంటోని ప్లాన్ చేశాడు. ఇక ఈ విషయం జరిగిన సంగతులు అన్నీ సిద్దార్థ్‌కు దర్శకుడు శశి తెలియజేశారు. సిద్దార్థ్ బిజీగా వుండడంతో విజయ్ ఆంటోని చేస్తున్నాడని తెలిసి వెంటనే పాజిటివ్‌గా స్పందించాడు. అలా వచ్చిన అవకాశమే విజయ్ ఆంటోని నటుడిగా తెలుగువారికి పరిచయం చేసింది. కట్ చేస్తే ఇప్పుడు బిచ్చగాడు2 సినిమాను విజయ్ ఆంటోని చేస్తున్నాడు. దానికి దర్శకుడు శశిని మరలా దర్శకత్వం చేయమని అడిగాడు. కానీ శశి తను వేరే సినిమాల్లో బిజీగా వుండడంతో అది కుదరలేదు. సో. ఇలా బిచ్చగాడుకు సిద్దార్థ్‌కు మిస్ అయితే, ఇప్పుడు రెండో భాగం శశికి దర్శకత్వం మిస్ అయింది. అదే సినిమా మాయ అంటే.