గొప్ప నటి అవుదామని వచ్చి ప్రేమలో పడింది.. ప్రియుడికి సర్వం ఇస్తే చివరకు?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (17:23 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రజినీకి సినిమాలంటే పిచ్చి ప్రేమ. సీరియళ్ళలోనైనా, సినిమాలోనైనా నటించాలనుకునేది రజిని. దీంతో తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్‌కు వచ్చేసింది. కూకట్‌పల్లిలో ఒక లేడీస్ హాస్టల్‌లో ఉండేది. 
 
నెలరోజుల పాటు కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను కలిసింది. అయితే ఆమెకు అవకాశాలు మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. మదనపల్లిలో తనతో పాటు చదువుకున్న అనామిక సహాయంతో ఒక చిన్న ప్రొడ్యూసర్‌ను కలిసింది. ఆయన పేరు రామరాజు. చిన్నపాటి సీరియళ్ళు చేసేవాడు. అది కూడా యు ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవాడు. ముందుగా ఈ అవకాశంతో తన టాలెంట్‌ను నిరూపించుకుని ఆ తరువాత బుల్లితెరపైకి వెళదామని నిర్ణయించుకుంది రజిని.
 
15 రోజుల పాటు ఒక చిన్నపాటి సీరియల్లో నటించింది. తను ఉన్న లేడీస్ హాస్టల్‌కు దగ్గరలో అవినాష్ అనే యువకుడు ఉండేవాడు. రజినీతో అవినాష్ పరిచయం పెంచుకున్నాడు. ప్రతిరోజూ షూటింగ్‌కు అవినాష్‌ డ్రాప్ చేసి తిరిగి తీసుకొచ్చేవాడు. ఇలా వారి పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది.
 
తనను పెళ్ళి చేసుకోమని అవినాష్‌‌ను ప్రాధేయపడింది. సీరియళ్ళలో నటిస్తున్న రజినీకి అక్కడున్న వారితో సంబంధం ఉంటుందని అనుమానించాడు అవినాష్. ఆమెపై లేని పోని ఆరోపణలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చివరకు తీవ్ర ఆవేశంలో రజినీని గొంతు నులిమి చంపేశాడు అవినాష్‌. కూకట్‌పల్లి పోలీస్టేషన్‌కు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments