Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎఫైర్, ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన రాములమ్మ

Advertiesment
ఎఫైర్, ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన రాములమ్మ
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (19:18 IST)
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ మహిళ  ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లికి చెందిన ఆంజనేయులుకు మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరుకు చెందిన రాములమ్మతో 17 యేళ్ల క్రితం వివాహమైంది.
 
భర్తతో వివాదాలు రావడంతో కూతురుతో కలిసి స్వగ్రామమైన మద్దూరులోనే నివాసం ఉంటుంది రాములమ్మ, అదే గ్రామానికి చెందిన పరిచయం ఉన్న వ్యక్తి సలీంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. మూడు నెలల క్రితం గ్రామంలో పంచాయతీ నిర్వహించి రాములమ్మను కేతేపల్లికి తీసుకెళ్లాడు ఆంజనేయులు. ఈ నేపథ్యంలో కేతేపల్లికి వెళ్లడం ఇష్టం లేని రాములమ్మ భర్త ఆంజనేయులును అంతమొందించాలని  నిర్ణయించుకుంది.
 
తన ప్రియుడు సలీంతో పాటు సోదరుడు రాజులకు విషయం చెప్పి భర్తను తన స్వగ్రామం అయిన మద్దూరుకు ఏదో పని సాకుతో భర్త ఆంజనేయులును పంపింది. గత నెల 23వ తేదీన మద్దూరుకు వచ్చిన ఆంజనేయులుకు అతని బావమరిదితో పాటు సలీంలు కలిసి మద్యం తాగించి, తలపై కర్రతో కొట్టి చంపి పొలంలోనే పాతేసారు. ఇదేం తెలియనట్లు భార్య రాములమ్మ సిసికుంట పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసి అందరిని నమ్మిచే ప్రయత్నం చేసింది. 
 
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం బయట పడింది. భార్య రాములమ్మ, సలీం, రాజులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు పోలీసులు. పూడ్చిపెట్టిన శవాన్ని తీసి తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#MamallapuramSummit తమిళ పంచెకట్టులో మోడీ.. ద్వైపాక్షికంలోనూ సంప్రదాయానికి పెద్దపీట