Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువ ఎంపీ మాధవి ల‌వ్ స్టోరీ వెన‌కున్న అస‌లు క‌థ‌... ఇంత‌కీ ఏంటా క‌థ‌..?

Advertiesment
యువ ఎంపీ మాధవి ల‌వ్ స్టోరీ వెన‌కున్న అస‌లు క‌థ‌... ఇంత‌కీ ఏంటా క‌థ‌..?
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (16:18 IST)
వేస‌వి కాలం.. వ‌ర్షం కాలం.. శీతాకాలం.. ఇలా కాలాలు ఉన్నాయి కానీ... ప్రేమ‌కంటూ ఓ కాలం లేదు. అందుక‌నే  ప్రేమ ఎవ‌రిలో.. ఎప్పుడు.. ఎలా.. పుడుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అలాగే ప్రేమ‌కు ఎవ‌రూ అతీతులు కారు. డబ్బు ఉన్న వాళ్లల్లో అయినా.. డ‌బ్బు లేని వాళ్ల‌లో అయినా ప్రేమ ప్రేమే. ఇంత‌కీ... ప్రేమ గురించి ఇంత‌లా ఎందుకు చెబుతున్నామంటే... యువ ఎంపీ ల‌వ్ స్టోరీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
ఇంత‌కీ ఆ ఎంపీ ఎవ‌రు..? వాళ్ల ల‌వ్ స్టోరీ ఏంటి..? అనేది వివ‌రాల్లోకి వెళితే... మన ఆంధ్ర రాష్ట్రానికే చెందిన ఓ యువ ఎంపీ.. ఇలా పెళ్లికూతురుగా ముస్తాబవుతుండడమే ఇక్కడ ప్రత్యేకత. ఆ ఎంపీ ఎవ‌రో కాదు. అరకు ఎంపీ గొట్టేటి మాధవి. పెళ్లి కూతురయ్యారు. ఎంపీగా గెలిచి.. ప్రజా జీవితంలో నిలదొక్కుకున్న ఆమె.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ విజయవంతమయ్యారు. 
 
తన పదహారేళ్ల ప్రేమను.. వివాహ బంధంగా మార్చుకోబోతున్నారు. ఎస్​టీ థెరీసా విద్యాసంస్థల నిర్వాహకుడు కుసిరెడ్డి శివప్రసాద్​ను మరో వారంలో ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్న ఈ ఇద్దరు.. మొదట ప్రాణ స్నేహితుల్లా మెలిగారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వీళ్ల తల్లిదండ్రులూ స్నేహితులు కావడం.. ఇద్దరి బంధాన్ని ధృఢంగా మార్చింది. 
 
మాధవి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు, శివప్రసాద్ తండ్రి కుసిరెడ్డి నారాయణ మూర్తి ఇద్దరూ మిత్రులు. ఇలా పరిచయమై స్నేహితులుగా మారిన మాధవీ-శివప్రసాద్… ప్రేమికులయ్యారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకున్నారు. ఒకరికొకరు అభిప్రాయాలు గౌరవించుకుంటూ.. తోడుగా, స్ఫూర్తిగా నిలిస్తూ.. జీవితంలో నిలదొక్కుకున్నారు.
 
బీఎస్సీ బీఈడీ చదివిన మాధవి.. ఒప్పంద పద్ధతిలో పీఈటీ టీచర్‌గా పని చేశారు. శివ ప్రసాద్.. ఎస్‌టీ థెరిసా విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా, శివ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అనూహ్యంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాధవి వచ్చారు. రాజకీయ కురువృద్ధుడు కిశోర్ చంద్రదేవ్​ను అత్యధిక మెజారిటీతో ఓడించారు. రాష్ట్రంలో చిన్న వయసులోనే ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టి సంచ‌ల‌నం సృష్టించారు. 
 
ఈ నెల 17న అరకు ఎంపీ మాధవి స్వగ్రామమైన… విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో రాత్రి 3 గంటల 15 నిముషాలకు వివాహం జరగనుంది. ఎంపీగా విజ‌యం సాధించిన మాధ‌వి.. ప్రేమ‌లోను విజ‌యం సాధించి కొత్త జీవితంలోకి అడుగుపెట్ట‌బోతున్నారు. శుభాకాంక్షలు చెప్పేద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముద్దాయికి సుప్రీంకోర్టుకు లేఖ రాసే అర్హత ఉందా? వర్ల రామయ్య ప్రశ్న