తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోగిన బడిగంట...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో బడిగంట మోగింది. సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాల తలుపులు తెరుచుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల చదువులు అస్తవ్యస్తంగా మారిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను సోమవారం నుంచి పాఠశాలలు తెరిచారు. 
 
నిన్నటి వరకు వేసవి సెలవుల ఒడిలో సేదతీరిన చిన్నారులు చదువుల తల్లి ఒడిలోకి చేరుతున్నారు. అందుకు తగినట్టుగానే ఆయా పాఠశాలలో యజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యంగా, కరోనా జాగ్రత్తలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నాయి. 
 
విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. తరగతి గదుల శానిటైజేషన్‌ను విధిగా చేశారు. స్కూల్లో ఒక విద్యార్థికి పాజిటివ్ అని తేలితే ఆ విద్యార్థి చుట్టుపక్కల కూర్చున్న విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పాఠశాలల ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచారు. 
 
తరగతి గదులు, బెంచీలు, కిటికీలు, టాయిలెట్లు, నల్లాలు, హ్యాండ్‌వాష్‌ సింక్‌లు, తాగునీటి ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు ఇలా ప్రతి ఒక్కదాన్ని శుభ్రం చేయించారు. ట్యాంకుల్లో పేరుకుపోయిన చెత్త, నిల్వ నీటిని తొలగించారు. పాఠశాల ప్రాంగణాలను కూడా శానిటైజ్ చేశారు. 
 
కాగా, హైదరాబాద్ జిల్లాలో 2821, రంగారెడ్డి జిల్లాలో 2682, మేడ్చల్ జిల్లాలో 1948 పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments