Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ జాతీయ పార్టీ.. అదే కారు బొమ్మ..? భారత్ రాష్ట్రీయ సమితి పేరిట?

Advertiesment
KCR_KTR
, శనివారం, 11 జూన్ 2022 (14:33 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పార్టీకి రంగం సిద్ధం చేస్తున్నారు. జాతీయ పార్టీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపేరు భారత్ రాష్ట్రీయ సమితి ఆఫ్ ఇండియా అని పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 19న తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 
 
త్వరలోనే పార్టీ పేరును రిజిస్టర్ చేసుకోనున్నట్లు సమాచారం. ఈ పార్టీకి కారు గుర్తును సైతం అడిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త జాతీయ ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 
 
ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. బీజేపీ ఆగడాలకు బ్రేక్ వేసే దిశగా పనిచేయాలని కేసీఆర్ శుక్రవారం అత్యవసర సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ వల్ల దేశం అధోగతి పాలైంది. 
 
కాంగ్రెస్ విపక్షంగానూ విఫలం అయినందున.. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పాత్రను  కొత్త పార్టీ పోషిస్తుంది అన్నట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇందుకోసం కేసీఆర్ రాష్ట్రపతి  ఎన్నికలను  ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు  వేదికగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. 
 
వివిధ పార్టీలను ఏకం చేసి ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడం ద్వారా బిజెపికి తగిన గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   
 
మంత్రులు సైతం కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత తాను ముఖ్యమంత్రిగానే ఉంటూ దేశం కోసం పని చేస్తానని సీఎం చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ ఇకపై జాతీయ రాజకీయాలను అడ్డాగా మారుతుందని ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
ఈ సందర్భంగా కొత్త పార్టీకి జై భారత్, నయా భారత్, భారత రాష్ట్రీయ తనిఖీ తదితర పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాదులో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెలలో జరుగనున్నాయి. దీనికంటే ముందే జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నదిలో పడిన ఆయిల్ ట్యాంకర్.. నలుగురు మృతి