Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగులకు అండగా నిలిచింది ప్రభుత్వాస్పత్రులే: కేటీఆర్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (09:49 IST)
ప్రైవేట్‌ ఆస్పత్రులు తిరస్కరించినా రోగులకు అండగా నిలిచింది ప్రభుత్వాస్పత్రులేనని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కరోనా వైరస్‌కు ఎవరూ అతీతులు కారన్నారు. కరోనా బాధితులను వెలివేయడం మంచిది కాదని కేటీఆర్ సూచించారు.

ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందన్నారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామని పేర్కొన్నారు. ఐదు కాలేజీల్లో కలిపి దాదాపు వెయ్యి పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.

కేసీఆర్‌ కిట్ల వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి, కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రం పరీక్షలు చేయడం లేదనే మాట అర్థరహితమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం సరికాదని సూచించారు. పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో ఉన్నా 98 శాతం మంది కోలుకున్నారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments