Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విపత్కర సమయంలో ఆపద్బాంధవి ‘108’.. పేషెంట్లకు వెన్నుదన్నుగా అంబులెన్సులు

Advertiesment
విపత్కర సమయంలో ఆపద్బాంధవి ‘108’.. పేషెంట్లకు వెన్నుదన్నుగా అంబులెన్సులు
, బుధవారం, 20 మే 2020 (09:38 IST)
లాక్‌డౌన్, కరోనా విపత్కర పరిస్థితులతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సమయంలో రాష్ట్రంలో 108 అంబులెన్సులు నిర్వహించిన పాత్రపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అనారోగ్యానికి గురైన వారు ఆస్పత్రులకు ఎలా వెళ్లాలో తెలియక సతమతవుతున్న వేళ క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఫోన్‌ చేస్తే చాలు 20 నిముషాలలోపే ఆపద్బాంధవుల్లా ఘటనాస్థలికి వాహనాలు చేరుకున్నాయి. అర్ధరాత్రైనా అపరాత్రైనా 108కి ఫోన్‌ చేస్తే చాలు సేవలు అందించాయి. 
 
 కోవిడ్‌ బాధితులకు ప్రత్యేకంగా..
► మార్చి 4 నుంచి మే 19 వరకు 83,679 మందికి అత్యవసర సేవలు అందించిన ఘనత 108లకే దక్కింది. 
► కోవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా కొన్ని అంబులెన్సులు సేవలు అందించగా మిగతావి ఎమర్జెన్సీ సేవలకు వినియోగించారు.
► గర్భిణుల నుంచి పాముకాటు బాధితుల వరకు వేలాది మందిని అత్యవసర సమయంలో ఆస్పత్రులకు చేర్చి అంబులెన్సులు ఆదుకున్నాయి.

అత్యధికంగా తూర్పు గోదావరిలో సేవలు...
► అనంతపురం జిల్లాలో 2,822 మంది గర్భిణులు 108 వాహనాల్లో ఆస్పత్రులకు చేరుకున్నారు.
► చిత్తూరు జిల్లాలో పాయిజనింగ్‌ కేసుల్లో 215 మందిని అంబులెన్సుల్లో తరలించారు. 
► కార్డియాక్‌ (గుండెపోటు) బాధితులు అత్యధికంగా 355 మంది గుంటూరు నుంచి 108 సేవలు వినియోగించుకున్నారు
► కృష్ణా జిల్లాలో 7,555 మందికి అంబులెన్సులు వివిధ రకాల అత్యవసర సేవలు అందించాయి.
► శ్రీకాకుళం జిల్లాలో 584 మంది డయాలసిస్‌ బాధితులు 108 సేవలు వినియోగించుకున్నారు. 
► అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 9,396 మందికి 108 అంబులెన్సులు సేవలు అందించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇపుడు కొనుక్కోండి... ఓ యేడాది తర్వాత డబ్బు చెల్లించండి.. కరోనా ఆఫర్!