Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ హ్యాక్

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (22:21 IST)
నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ హ్యాక్ చేశారు కేటుగాళ్ళు. రంగనాథ్ ఆవుల వెంకట పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా ఎస్పీ అనుకుని చాలామంది యాక్సెప్ట్ చేశారు. దీంతో ఎస్పీ పేరుతో డబ్బుల వసూళ్ళకి తెగపడ్డారు కేటుగాళ్ళు. తన భార్య అకౌంట్‌కి 20,000 వేయాలంటూ ఒకరికి మెసేజ్‌లు చేశారు.
 
ఒరిస్సాకి చెందిన మహిళ అనిత పేరుతో గూగుల్ పే ఫోన్ పే నెంబర్ పంపుతున్న కేటుగాళ్ళు డబ్బుల పంపిన వెంటనే స్క్రీన్ షాట్ కొట్టి పంపాలంటూ పలువురుతో చాటింగ్ చేసినట్టు గుర్తించారు. విషయం తెలిసి షాక్ తిన్న ఎస్పీ రంగనాథ్, ప్రస్తుతం ఈ రిక్వెస్ట్ వస్తున్న అకౌంట్ 2 సంవత్సరాల క్రితం వాడటం మానేశానని అంటున్నారు. 
 
ఇది తన అకౌంట్ కాదంటూ క్లారిటీ ఇచ్చిన ఎస్పీ రంగనాథ్ ఎవరూ డబ్బులు పంపొద్దని కోరారు. ఈ అకౌంట్ హ్యాకింగ్ మీద సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయనున్నారు ఎస్పీ.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments