బైక్ దొంగలించారు ప్రభో అంటే.. ఫైన్ కట్టమంటున్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (12:50 IST)
పోలీసుల నిర్లక్ష్యం ఓ వాహనదారుడి పాలిట శాపంగా మారింది. బైక్ చోరీకి గురైందని రికవరీ చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చోరీకి గురైన ఆ బైక్ నగరంలో యధేచ్చగా రోడ్లపై తిరుగుతుంటే.. వాటి ఫొటోలు తీసి బాధితుడికి ఇ-చలాన్లు పంపారు. పోలీసుల తీరుపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. 
 
హైదరాబాద్ కుషాయిగూడ నేతాజీనగర్‌కు చెందిన శేషాద్రి తమ ఇంటి ముందు పార్క్ చేసిన మోటారు సైకిల్ చోరీకి గురైనట్టు గతేడాది జనవరిలో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ చోరీకి గురైన ఘటనపై కేసు బుక్ చేసిన పోలీసులు మాత్రం రికవరీ చేయడాన్ని మరిచారు. అపహరణకు గురైన ఆ బైక్ పైన దొంగలు యధేచ్చగా నగర రోడ్లపై తిరుగుతున్నా.. పోలీసులు ఎక్కడా ఆపలేదని.. హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారంటూ పోలీసులు శేషాద్రికి ఇ-చలాన్లు పంపారు. 
 
బైక్‌ను రికవరీ చేయకుండా.. రోడ్లపై తనిఖీల్లో కూడా బైక్‌ను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోతున్నాడు బాధితుడు. ఇ-చలాన్లు అన్నీ హెల్మెట్ ధరించలేదంటూ పంపారంటూ సోషల్ మీడియాలో శేషాద్రి పోస్ట్ చేశాడు. చలాన్లు పంపే శ్రద్ద బైక్ రికవరీ చేయడంలో పోలీసులు కనబరిస్తే బాగుంటుందంటున్నాడు బాధితుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments