Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీలో చల్ల చల్లగా.. కూల్ కూల్‌గా కాపురం చేసిన పాము.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (12:32 IST)
ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు వామ్మో అనిపించాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు వేసవి ఎండలకు భగభగమండిపోతున్నాయి. ఏసీలు లేకుండా ఇళ్లల్లో వుండలేకపోతున్నారు చాలామంది. అలాంటి ఏసీల్లో చల్లచల్లగా కూల్ కూల్‌గా మనుషులే కాదు.. మేమూ వుంటామని చెప్తున్నాయి పాములు. 
 
అవునండి.. ఇప్పటికే ఏసీల్లో పాములు చిక్కుపోయిన ఎన్నో ఘటనలు వినేవుంటాం. అయితే తాజాగా పుదుచ్చేరిలోని ఓ ఇంట్లో ఏసీలో హాయిగా వుండిపోయిన ఓ పామును ఏసీ మెకానిక్ బయటికి తీశాడు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి, తేంగాయ్‌తిట్టు ప్రాంతానికి చెందిన ఏళుమలై.. ఇంట్లోని ఏసీని ఆన్ చేశాడు.
 
అయితే ఏసీ నుంచి ఏదో వెరైటీ సౌండ్ రావడంతో ఆపేశాడు. వెంటనే ఏసీ మెకానిక్‌ను పిలిపించాడు. మెకానిక్ కూడా ఏసీ పైకప్పు తీసి.. లోపాన్ని పరిశీలిస్తుండగా అతను షాకయ్యాడు. 
 
ఏసీలో హాయిగా కాపురం చేస్తున్న పామును చూసి జడుసుకున్నాడు. ఆపై ఏళుమలై అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. సిబ్బంది హుటాహుటిన ఏళుమలై ఇంటికి చేరుకున్నారు. ఏసీలోని పామును పట్టుకున్నారు. ఆపై అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments