Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తకు మద్యం తాగించి ప్రియుడుతో కలసి...

Advertiesment
Affair
, శుక్రవారం, 14 జూన్ 2019 (12:15 IST)
అగ్నిసాక్షిగా తాళి కట్టించుకుని, పెళ్లి పీటలు మీద చేసుకున్న ప్రమాణాలు అపహాస్యం అవుతున్న ఘటనలు చూస్తున్నాం. కట్టుకున్న భర్తనో, భార్యనో కాదని వివాహేత‌ర సంబంధాలు వైపునకు అడుగులు వేస్తున్న కథనాలు వింటూ ఉన్నాం. వాటి పర్యవసాలు ఎలా ఉంటున్నాయో. ఎంత‌టి దారుణాల‌కు దారితీస్తున్నాయో ఈమధ్య జరిగిన సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. 
 
కట్టుకున్న భర్తను దారుణంగా చంపించి ఓ ఇల్లాలు. అది కూడా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న ఒకే ఒక కారణంగా చంపేసింది.  వివరాల్లోకి వెళితే భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా టేకుల‌పల్లి మండ‌లం తావూర్యాతండ‌కు చెందిన నందు భుక్యా సుప్రియతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి  ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నందు ఓ షాపులో పనిచేస్తూ కుటంబాన్ని పోషించుకుంటున్నాడు. 
 
సుప్రియ తాను కూడా ఏదైనా పనిచేస్తానని, ఇద్దరం సంపాదిస్తే కుటుంబ పోషణకు కష్టం ఉండదని భర్త నందుకు చెప్పడంతో ఆమెను ఓ  టైలరింగ్ షాపులో పనికి పెట్టించాడు. రోజూ సుప్రియ టైలరింగ్ షాపుకు వెళ్లే క్రమంలో కృష్ణ‌ అనే వ్యక్తితో పరిచయం పెరిగి అదికాస్తా వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. అది తెలిసిన నందు ఆమెను మందలించాడు. పద్ధతి మార్చుకోమని తెలియజేశాడు. దీంతో సుప్రియ ఎలాగైనా నందును అడ్డు తొలిగించుకోవాలని పథకం రచించింది. 
 
తన ప్రియుడుతో కలిసి ఓ స్కెచ్ వేసింది. ప్రియుడుతో కలసి బలవంతగా భర్త నందు చేత పూటుగా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న నందును మంచానికి కట్టేసి స్కూటర్ క్లచ్ వైరుతో భర్త గొంతుకకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు. ఈ ఘటన జూన్ 6 వ తేదీన జరిగింది. పోలీసులే అన్నికోణాల్లో విచారించగా మృతుడు భార్య కనిపించకపోవడంతో  అనుమానం వచ్చి విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019 విశ్వవిజేతగా నిలిచేది మాత్రం "మెన్ ఇన్ బ్లూ'': సుందర్ పిచాయ్