వయోబేధాలు, వావివరుసలు లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా కన్నబిడ్డపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యకు బాలిక తల్లి కూడా సహకరించిందనే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కోవై, పొల్లాచ్చికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రైతు.. వృత్తి కోసం విలుప్పురంలో సెటిలయ్యాడు. ఇతనికి 14ఏళ్ల కుమార్తె వుంది. ఈమె సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అంతేగాకుండా తన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వెంటనే 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల వద్ద విచారణ జరిపారు. ఆ బాలిక ఫిర్యాదు చేసినట్లే.. కామాంధుడైన తండ్రి కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడనే నిజం వెలుగులోకి వచ్చింది. ఈ దురాగతానికి ఆ బాలిక తల్లి కూడా సహకరించిందని తెలిసి పోలీసులు షాకయ్యారు. ఆపై బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.