కత్వా బాలిక అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. కత్వా ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో నాలుగు రోజుల పాటు నిర్భంధించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య కూడా చేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసుపై పంజాబ్, పఠాన్ కోట్ జిల్లా న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సంజీరామ్, ఆనంద్, పర్వేష్ కుమార్, దీపక్, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ అనే ఆరుగురిని కోర్టు నిందితులుగా నిర్ధారించింది.
ఈ ఆరుగురిలో సంజీరామ్, దీపక్, పర్వేష్‌లకు జీవితఖైదును విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మిగిలిన ముగ్గురిలో తిలక్, ఆనంద్, సురేందర్ వర్మలకు ఐదేళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది. అలాగే ఈ కేసులో మైనర్ అయిన విశాల్ అనే వ్యక్తి విడుదలయ్యాడు.