పీఎం-కేర్స్ నిధికి విరాళంగా కోటిరూపాయలు, ఒకనెల వేతనం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (23:02 IST)
దేశవ్యాప్తంగా “లాక్‌డౌన్” నేపథ్యంలో పునరావాస కార్యక్రమాల కోసం ఉద్దేశించిన “పీఎం-కేర్స్ ప్రత్యేక నిధి”కి ఎంపీల్యాడ్స్ నుంచి కోటి రూపాయలతోపాటు, తన ఒకనెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.
 
2020-21 సంవత్సరానికి “ఎంపీ ల్యాడ్స్” నిధులనుంచి ఆ కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర “ముఖ్యమంత్రి సహాయ నిధి”కి రూ.50 లక్షలు, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో “కరోనా” సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.50లక్షలను కూడా ఇస్తున్నట్లు తెలిపారు.
 
దీనికి సంబంధించిన లేఖలను ఎం‌పి లాడ్స్ కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ కలెక్టర్‌లకు పంపించారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు తోచినంత మొత్తాన్ని “పీఎం-కేర్స్ నిధి”కి విరాళాల రూపంలో అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9వ సీజన్‌లో విన్నర్ ఎవరు? ఏఐ ఎవరికి ఓటేసిందంటే?

Prabhas: రాజా సాబ్ నుంచి ప్రభాస్,నిధి అగర్వాల్ లపై మెలొడీ సాంగ్ ప్రోమో రిలీజ్

Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు, వ్యక్తిత్వమే విప్లవం, వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments