తమిళిసైతో కేసీఆర్‌ భేటీ

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:30 IST)
తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. తమిళిసైతో సీఎం దాదాపు గంటన్నర పాటు చర్చించారు. లాక్‌డౌన్‌తో పాటు ఢిల్లీ మర్కజ్‌ సదస్సుకు వెళ్లొచ్చినవారిపై చర్చించారు.

కరోనా నివారణకు చేపట్టిన అంశాలను తమిళిసైకు కేసీఆర్ వివరించారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.

సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మంత్రి ఈటల, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు, ఇతర అంశాలపై చర్చించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వలస కార్మికులకు రెడ్ క్రాస్ ఆహార పంపిణీ