Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీది రాజకీయ పార్టీ అయితే.. మాది మఠమా? : కేసీఆర్‌

మీది రాజకీయ పార్టీ అయితే.. మాది మఠమా? : కేసీఆర్‌
, మంగళవారం, 17 మార్చి 2020 (08:00 IST)
'మీది రాజకీయ పార్టీ అయితే.. మాది మఠమా' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎం మాట్లాడారు. రాజకీయంగా మాట్లాడితే రాజకీయ సమాధానమే వస్తుందన్నారు.

భట్టి విక్రమార్క మాట్లాడింది ప్రజలు వింటున్నారన్నారు. ప్రతిపక్షాలు సబబుగా మాట్లాడితే సబబైన సమాధానమే వస్తుందన్నారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందేనన్నారు. డ్రామా కంపెనీల్లా తయారయ్యాయని విమర్శించారు.
 
దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంటుందని కేసీఆర్‌ అన్నారు. 2014-19 మధ్య కేంద్రానికి భారీగా పన్నులు చెల్లించామన్నారు. ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో చెల్లించామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1.12లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. హైదరాబాద్‌కు 24 గంటల నీటి సదుపాయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అవసరమైతే మద్యం ధరలు మళ్లిd పెంచుతామన్నారు.

ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచలేదని, ఇప్పుడు బాజాప్తా పెంచుతామన్నారు. మైనస్‌లో ఉన్న అనేక రంగాల్ని ప్లస్‌లోకి తెచ్చామని కేసీఆర్‌ అన్నారు. అప్పుల్లో ఉన్న విజయా డైరీని లాభాల్లోకి తెచ్చామన్నారు. తాము కంది రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందన్నారు. కనీస మద్దతు ధర కేంద్రం చేతుల్లో ఉందన్నారు. ఓల్డ్‌ సిటీలో మెట్రో ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు.

బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎం మాట్లాడారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.

పేదల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ప్రస్తుతం పెన్షన్‌ను వందశాతం పెంచి రూ.2,016 చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.200 పెన్షన్‌ ఇచ్చేవారన్నారు. ప్రాజెక్టులకు డీపీఆర్‌ కావాలని విపక్షాలు అడుగుతున్నాయని, ప్రాజెక్టులకు బహిరంగంగా టెండర్లు పిలుస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామని ప్రశ్నించారు.
 
చరిత్ర సృష్టించిన తెలంగాణ శాసనసభ
తెలంగాణ శాసనసభ చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 25 బడ్జెట్ పద్దులతోపాటు 5 బిల్లులు, ఒక తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. 25 మంది ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనగా పదిమంది మంత్రులు సమాధానం ఇచ్చారు. కరోనా ప్రభావం దృష్ట్యా బడ్జెట్ సమావేశాలు కుదించడంతో ఆదివారం అసెంబ్లీ అజెండాలో చాలా అంశాలు చేర్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ పనులకు సిమెంటు రేటు తగ్గింపు