Publish Date: Wed, 01 Apr 2020 (20:16 IST)
Updated Date: Wed, 01 Apr 2020 (20:19 IST)
గుంటూరు నగరంలోని నల్లచెరువు బైపాస్ రోడ్డులో అనేక స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులున్నాయి. వీటిలో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తుంటారు. సీజన్ వరకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటుచేసుకుని కుటుంబాలతో నివసిస్తూ వుంటారు.
ఊరికి చివరిగా నివసించే వీరికి నగరంతో కరోనా కర్ఫ్యూ కారణంగా సంబందాలు తెగిపోయాయి. వారు పనిచేస్తున్న మిల్లులు మూతపడ్డాయి. వారిదగ్గర వున్న ఆహారపదార్దాలు కొన్ని రోజులొచ్చాయి. కొన్ని రోజులనుంచి పిల్లాపాపలతో పస్తులుంటున్నారు.
విషయాన్నీ తెలుసుకున్న రెడ్ క్రాస్ తక్షణం స్పందించింది. ఈ రోజు వారిని నల్లచెరువు బైపాస్ పెట్రోల్ బంకు సమీపంలోవున్న హజరత్ సయ్యద్ మౌలాషా రెహమతుల్ అలై @పెట్టివాలె బాబా దర్గా దగ్గరకు పిలిపించి. 200 మందికి ఆహారపొట్లాలు, మంచినీరు అందించారు.
ఆకలితో అలమటిస్తున్న తమను గుర్తించి కడుపునిండా ఆహారంపెట్టిన రెడ్ క్రాస్ సిబ్బందికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.