Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్ డౌన్ డోంట్ కేర్, కూతురు పుట్టినరోజును ఘనంగా చేసిన పోలీసు

లాక్ డౌన్ డోంట్ కేర్, కూతురు పుట్టినరోజును ఘనంగా చేసిన పోలీసు
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (21:47 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలెవ్వరు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఎలాంటి శుభ కార్యాలు చేయొద్దని చెప్పిన ప్రభుత్వం, ఆఖరికి ఈ రోజు శ్రీరామ నవమి వేడుకలను కూడా రద్దు చేసింది.
 
కానీ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీసులు మాత్రం అవన్నీ మాకు వర్తించవు అంటున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే టెంట్లు వేసి మరీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మేకలను కోసి దావత్ చేసుకున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి వేడుకలు నిర్వహించారు.
 
వివరాల్లోకి వెళితే గుండాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ కూతురి పుట్టిన రోజు ఈ రోజు. దాంతో స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్‌లో రెండు టెంట్లు వేసి, మండలం లోని అందరు సర్పంచ్‌లతో పాటు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ సందర్బంగా ప్రజలు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే చితక బాడుతున్న గుండాల పోలీసులు, తాము మాత్రం చట్టాన్ని ధిక్కరించి ఇలా వేడుకలు చేయడం ఏమిటని, చట్టాలు పోలీసులకు వర్తించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూకేలో చిక్కుకుపోయిన విద్యార్థులకు సహాయం చేయండి: పవన్ కళ్యాణ్