హోళీ రంగులతో హోరెత్తిస్తున్న పాట...అరుదైన ఘనత (video)

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:32 IST)
ఈ మధ్య కాలంలో జానపద పాటలతో బాగా పాపులర్ అయిపోయింది సింగర్ మంగ్లీ. ఇక బుల్లితెర ఈవెంట్‌లలో అప్పుడప్పుడూ తళ్లుక్కున మెరిసే ఈమె తన గళంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక పండగొస్తే చాలు, ఏదో ఒక పాట విడుదల చేస్తూ సందడి చేస్తోంది. ఇక స్మార్ట్‌ఫోన్‌ల కాలం కాబట్టి శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఇలాంటి పాటలను పోస్ట్ చేస్తూ, స్టేటస్‌లుగా పెడుతూ పాపులర్ చేసేస్తున్నారు నెటిజన్లు. 
 
ప్రతి పండుగకు తగినట్లు ఈ తెలంగాణ సింగర్ రిలీజ్ చేసే పాటలు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంటాయి. ఈ కలర్‌ఫుల్ ఫెస్టివల్ హోలీ సందర్భంగా ‘ఖతర్నాక్ ఖతర్నాక్ కలర్ చల్లురా.. కలర్ ఫుల్లు హోలీలోనే మస్తు థ్రిల్లురా..’ అంటూ మరో పాటను ఆలపించి నెట్‌లో విడుదల చేసింది మంగ్లీ. ఇందులో ఫిమేల్ వెర్షన్ మంగ్లీ పాడగా, మేల్ వెర్షన్‌ను హన్మంత్ యాదవ్ అనే వ్యక్తి ఆలపించారు. ఈ పాట మరో ఘనతను కూడా సాధించింది. ఈ పాటను విడుదల చేసిన కొద్దికాలంలోనే 1 మిలియన్ వ్యూస్ దాటి ఇంకా దూసుకుపోతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ అలరిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments