Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ సినీ తారల హోలీ శుభాకాంక్షలు

Advertiesment
టాలీవుడ్ సినీ తారల హోలీ శుభాకాంక్షలు
, గురువారం, 21 మార్చి 2019 (11:08 IST)
దేశ వ్యాప్తంగా గురువారం ఉదయం నుండి ప్రజలు హోలీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. రంగులు పులుముకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ హోలీ సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో యువత ఉదయం నుండే రంగులు చల్లుకుంటూ రోడ్లపై హంగామా చేస్తూ... అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హోలీని పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెపుతున్నారు! 
 
ఇలా శుభాకాంక్షలు తెలిపిన వారిలో సూపర్ స్టార్ మహేష్‌బాబు, మంచు విష్ణు, సుప్రీమ్ హీరో సాయి తేజ్‌గా మారిన సాయి ధరమ్ తేజ్, కాజల్ అగర్వాల్ ఉన్నారు. అయితే వీరిలో సాయి తేజ్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా ఉంది. హోలీ శుభాకాంక్షలు చెప్తూనే రంగులు వాడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. 
 
సరదాగా బయటికి వెళ్లినప్పుడు ఓ పిల్లికి పాలు పోస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పెడ్తూ ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీని సంతోషంగా, సురక్షితంగా జరుపుకోండి. మీ చుట్టూ ఆనందాన్ని, ప్రేమను వెదజల్లండి. హోలీ రంగులు జంతువులకు హాని చేయొచ్చు. కాబట్టి ప్లే గ్రీన్, ప్లే క్లీన్’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఇక మంచు విష్ణు చేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగానే ఉంది. ‘హ్యాపీ హోలీ! మహిళలను గౌరవించండి. ఈ పండుగ అల్లర్లు సృష్టించేదిగా, ఇతరులను ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఆనందంగా గడపండి ఫ్రెండ్స్!’ అని విష్ణు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా... మహేష్‌బాబు, కాజల్ అగర్వాల్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులకు క్షమాపణ చెప్పిన రౌడీ కామ్రేడ్ విజయ్ దేవరకొండ