Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోలీ పండుగ.. ఆ ఊళ్లో మాత్రం పిడికిళ్లతో కొట్టుకుంటారు...

హోలీ పండుగ.. ఆ ఊళ్లో మాత్రం పిడికిళ్లతో కొట్టుకుంటారు...
, గురువారం, 21 మార్చి 2019 (11:24 IST)
హోలీ పండుగ రంగుల పండుగ, అందరూ రంగులు పూసుకుంటారు లేదా చల్లుతారు. ఇష్టంలేని వారు గమ్మున ఇంట్లో కూర్చుంటారు. కానీ ఓ ఊళ్లో మాత్రం మగవాళ్లంతా గాయాలయ్యేలా పిడికిళ్లతో కొట్టుకుంటారు. దానికి పేరు కూడా పిడిగుద్దులాట అని పెట్టారు. కొట్టుకుంటే రక్తాలు వస్తాయి అని తెలిసి కూడా ఆటను కొనసాగిస్తారు. తమకు ఏమీ కానట్లు మిన్నుకుండిపోతారు. 
 
హోలీ రోజు రంగుపడుద్ది అంటూ వినూత్న ఆచారాన్ని పాటించే ఈ గ్రామం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్స. గురువారమే హోలీ కదా, గ్రామ పురుషులంతా ముష్టిఘాతాలకు సిద్ధమవుతున్నారు. పిడిగుద్దులాట చేయకపోతే గ్రామానికి అరిష్టం అని నమ్ముతారు. దానికి నిదర్శనంగా గతంలో పిడిగుద్దులాట జరపకపోవడం వల్ల నీళ్ల ట్యాంక్ కూలిపోయిందని చెబుతారు. 
 
హోలీ రోజు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడలిలో పురుషులు పిడికిళ్లను బిగించి ఒకరిపై ఒకరు అరగంట పాటు దాడి చేసుకుంటారు. తర్వాత పరస్పరం అలయ్‌బలయ్‌ చేసుకుంటారు. పిడిగుద్దులతో గాయపడిన వారు కామ దహన బుడిదను దెబ్బలకు రాసుకుంటారు. ఇలా చేస్తే ఎలాంటి గాయమైనా మానిపోతుందని వారి విశ్వాసం. కాగా గ్రామస్థుల సమ్మతితోనే ప్రతి ఏటా ఈ క్రీడను నిర్వహిస్తున్నామని మాజీ సర్పంచ్‌ వరాజ్‌ పటేల్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

70 అడుగుల లోతుగల బోరుబావిలో పడిన పిల్లాడు