తెలంగాణాలో 87 స్థానాల్లో పోటీకి అభ్యర్థుల సిద్ధం : కాసాని జ్ఞానశేఖర్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (15:26 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 87 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఆయన సోమవారం హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ భవన్‌లో మాట్లాడుతూ, రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో జరిగిన ములాఖత్ సమయంలో అన్ని విషయాలపై చర్చించినట్టు చెప్పారు. తెలంగాణాలో పార్టీ బలంగా ఉందని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా పోటీ చేస్తామన్నారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలా లేదా అనే త్వరలోనే తెలుస్తుందన్నారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామన్నారు. 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు ఆమోదించాక పేర్లు ప్రకటన ఉంటుంది. టీడీపీ తరపున రాష్ట్రంలో బాలకృష్ణ ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. 
 
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా  
 
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు ఏకంగా 500 పేజీలతో కూడిన కౌంటర్‌ను దాఖలు చేశారు. దీంతో విచారణను వాయిదా వేసింది.
 
కాగా, రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
 
ఇదే కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ఏ14గా సీఐడీ పోలీసులు పేరు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన వద్ద సీఐడీ పోలీసులు ఇటీవల రెండు రోజుల పాటు విచారణ కూడా జరిపిన విషయం తెల్సిందే. అయితే, ఈ కేసులో నారా లోకేశ్‌ను అరెస్టు చేసే ముందు 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే విచారిస్తామని ప్రకటించారు. 
 
దసరా సెలవులకు ఇంటికొచ్చిన విద్యార్థిని గుండెపోటుతో మృతి 
 
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఏడో తరగతి బాలిక ఒకరు గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ బాలిక ఇంటితో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పగా తల్లిదండ్రులు వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కన్నుమూశారు. 
 
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘింక సంక్షేమ గురుకుల పాఠశాలలో కంజర గ్రామానికి చెందిన అదరంగి మైథిలి అనే బాలిక ఏడో తరగతి చదువుతుంది. ఆమె అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.
 
దీంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి ఛాతిలో నొప్పిగా ఉందని మైథిలి తల్లికి చెప్పింది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించరు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments