కేసీఆర్‌పై ఫైర్ అయిన కేఏపాల్... మహిళలను రాష్ట్రపతి ఎంపికపై హర్షం

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (20:55 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేఏపాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌‌కు ఫిర్యాదు చేసినట్లు పాల్ చెప్పారు. 
 
ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌తో సమావేశం అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ చేస్తున్న అవినీతిపై ఇంతవరకు ఎవరూ సరైన రీతిలో ఫిర్యాదు ఇవ్వలేదని, అందువల్లే సీబీఐ వారిపై చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. 
 
యాదగిరిగిగుట్ట నిర్మాణం విషయంలో అవినీతి చోటుచేసుకుందని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు పాల్​ తెలిపారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రూ.లక్షా ఐదు వేలకోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదులో తెలిపినట్లు వివరించారు పాల్​. 
 
ఇక గతంలో తనపై జరిగిన దాడి విషయంలో ఇంకా ఎందుకు అరెస్టులు జరగలేదని ప్రశ్నించానని పాల్ అన్నారు. అలాగే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను ప్రకటించడం సంతోషకరమని పాల్​ అన్నారు. 
 
తాను మొదటి నుండి షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని బీజేపీకి చెప్పానన్నారు. వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిగా వద్దని ఇదివరకే సూచించానని కేఏ పాల్ చెప్పడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments