Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గవర్నమెంట్ స్కూల్‌లో చేరితే రూ.5 వేల నగదు.. ఎక్కడ?

govt school
, సోమవారం, 20 జూన్ 2022 (10:12 IST)
ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ మాయాజాలం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. ఈ పాఠశాలలకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. పైగా, విద్య కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌లో చర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి రూ.5 వేలు ఇస్తామంటూ సర్పంచి ఆకిటి మహేందర్‌రెడ్డి, ఉపసర్పంచి ఆంజనేయులు ప్రకటించారు.
 
అంతేకాకుండా, దాతల సాయంతో అన్ని వసతులతో పాటు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. అంతేకాక విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, బస్‌పాస్‌ అందిస్తామని పేర్కొన్నారు. ప్రకటించిన నజరానాల వివరాలతో పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 1 నుంచి పోస్టాఫీసుల్లోని డిపాజిట్లపై పెరుగుతున్న వడ్డీ.. స్కీమ్స్ సంగతేంటి?